
బాలీవుడ్: సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అకాల మరణం తర్వాత మొదలైన నేపోటిజం వ్యతిరేకత రెండు నెలలైనా ఇంకా చల్లారలేదు. వారసత్వంగా వచ్చిన హీరోల పైన, యాక్టర్స్ పైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీని ఎఫెక్ట్ అలియా బట్ నటించిన సడక్ సినిమా పైన పడింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పైన డిస్ లైక్స్ వరల్డ్ రెకార్డ్ క్రియేట్ అయ్యే దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే చాల మంది వారసత్వ నటులకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వారి సినిమాలపై కూడా పడింది.
ఆలియా భట్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సడక్ 2 చిత్రం ఈ నెలలో హాట్ స్టార్ ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాకు మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో పాటు ఆలియా భట్ నటించడం వల్ల సుశాంత్ అభిమానులు రెచ్చి పోయి మరీ యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు డిస్ లైక్స్ కొడుతున్నారు. కేవలం 5 గంటల్లో ఈ ట్రైలర్ దాదాపు 3 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. అయితే దాదాపు 2 మిలియన్ డిస్ లైక్స్ను కూడా పొందడం చెత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. మహేష్ భట్ పై నెటిజన్స్ ఏ స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాకు కూడా ఇదే స్థాయిలో నెగిటివిటీ ప్రచారం చేస్తే సినిమా ఫలితం తారు మారు అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.