ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫోటో, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. యాప్‌లో లాగిన్ సమస్యలు, సర్వర్ కనెక్షన్‌లో అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సోషల్ మీడియా వేదికలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
యూజర్ల అసహనం
డౌన్‌డిటెక్టర్ (Downdetector) వెబ్‌సైట్ ప్రకారం, సుమారు 64% మంది యూజర్లు లాగిన్ సమస్యను, 24% మంది సర్వర్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ‘‘Something went wrong’’ అనే మెసేజ్ రావడంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ట్విట్టర్ (X) వంటి ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ, జైపూర్, లఖ్‌నవూ, ముంబయి, అహ్మదాబాద్, కలకత్తా, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో యూజర్లు ఈ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారన్న సమాచారం అందుతోంది.
కంపెనీ స్పందన
ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ లేదా పేరెంటు సంస్థ మెటా (Meta) ఈ సమస్యపై అధికారికంగా స్పందించలేదు. సేవలు ఎప్పుడు తిరిగి సాధారణ స్థితికి వస్తాయన్న దానిపై కూడా స్పష్టత లేదు.