హైదరాబాద్: రామ్ చరణ్ భార్య , ఉపాసన కొణిదెల సోషల్ సర్వీస్ గురించి తెల్సిన విషయమే. అపోలో హాస్పిటల్స్, బి పాజిటివ్ మ్యాగజైన్ బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తూ సోషల్ సర్వీస్ చేయడం లో కూడా ఎక్కడ వెనుకాడదు. తాను ఈ మధ్యనే URLife.co.in అనే వెబ్ సైట్ ప్రారంభించి పౌష్టికాహారం పై అవగాహన కల్పిస్తుంది. దీంట్లో అక్కినేని సమంత కూడా తన వంతు బాధ్యతగా మొదటి గెస్ట్ గా వచ్చి కొంత ప్రచారం కల్పించింది. ఇపుడు URLife.co.in కోసం రామ్ చరణ్ కూడా ముందడుగు వేశాడు.
‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ అనే షో తో దివ్యాంగుల్లో వున్న డ్యాన్స్ ని వెలికితీసే ముఖ్య ఉదేశ్యం తో ఒక షో ప్రారంభించబోతున్నారు ఉపాసన. ఇది ఒక ఆన్లైన్ షో. దీనికి సంబందించిన ఒక వీడియో కూడా విడుదల చేసారు. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫేర్స్ ప్రభు దేవా, ఫరా ఖాన్ లు కూడా పాల్గొనబోతున్నట్టు వీడియో లో తెలిపారు.
‘చిన్నప్పటి నుంచి తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడు యునిక్ డ్యాన్స్ టాలెంట్ షో ని అనౌన్స్ చేస్తున్నాను. టాలెంట్ ను కలిగి ఉన్న లవ్లీ దివ్యాంగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ urlife.co.in లో ఎంట్రీలను పొంది తమ వీడియోలను అప్లోడ్ చేయండి’ అని చరణ్ తెలిపారు. మెంటల్ డిస్టర్బ్ అయిన వారి వీడియోలను చూశానని.. అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని అధిగమిస్తూ వారు చూపించిన టాలెంట్ ని చూసి ఎంతో నేర్చుకున్నానని.. దివ్యాంగ సోదరసోదరీమణులకు అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి ఈ షోను సక్సెస్ చేయాలని రామ్ చరణ్ కోరాడు.