ముంబై: కరోనా దెబ్బకు గత ఏడాది నుంది ఇప్పటి వరకు చాలా వరకు వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు మాత్రం బాగానే లాభ పడ్డాయి. అయితే ఆఫ్‌లైన్ మార్కెట్ ఐన డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ మాత్రం మంచి లాభాలతో అదరగొడుతోంది. ఈ సంవత్సరం మార్చి నెలతో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ ఏకంగా రూ.413.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.
క్రితం సంవత్సరం (2020)న ఇదే కాలంలో వచ్చిన 271.28 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే ఈ సంవత్సరం లాభం ఏకంగా 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్‌మార్ట్ లిమిటెడ్‌కు చెందిన డీ-మార్ట్‌కు గత త్రైమాసికానికి గాను మొత్తం రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
క్రితం 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే మార్చి త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255.93 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 18.47 శాతం అధికంగా నమోదైంది. వార్షికంగా మార్జిన్ ఆధాయం 8.3 శాతం పెరిగి రూ.613 కోట్లకు చేరుకుంది.