టాలీవుడ్: యాంగ్రీ యాంగ్ మాన్ గా ఒకప్పుడు పోలీస్ సినిమాలంటే రాజ శేఖర్ ఫస్ట్ ఛాయస్ అన్నట్టు ఉండే ఈ సీనియర్ నటుడు గత కొన్ని సంవత్సరాలుగా హిట్లు లేక వెనకబడ్డాడు. గరుడ వేగ ఇచ్చిన సూపర్ సక్సెస్ తర్వాత వరుసగా వైవిధ్య మైన సినిమాలని సెలెక్ట్ చేసుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. గరుడ వేగ , కల్కి సినిమాల తర్వాత ప్రస్తుతం మూడు కొత్త సినిమాలని చేస్తున్నాడు రాజ శేఖర్. ఈ మూడు మూడు వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ రోజు ‘C /O కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ లాంటి సినిమాలని రూపొందించిన వెంకటేష్ మహా తో మరో సినిమా సినిమా ప్రకటించాడు.
‘మర్మాణువు’ అనే టైటిల్ పెట్టి ఒక పుర్రె బొమ్మ పెట్టి దానికి రాజులు ధరించే ఒక తల పాగా పెట్టి పోస్టర్ విడుదల చేసి ఈ సినిమాని ప్రకటించింది ఈ సినిమా టీం. పోస్టర్ మరియు టైటిల్ తోనే ఈ సినిమా ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసింది. వెంకటేష్ మహా సినిమాలు కూడా కొత్తదనం తో క్రిటిక్స్ ని మెప్పించేట్టు ఉంటాయి. ఈ సారి మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు అర్ధం అవుతుంది. మహా ఇంతకముందు డైరెక్ట్ రెండు సినిమాలని నిర్మించిన పరుచూరి ప్రవీణ మరియు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మిక్కీ జె మేయర్ సంగీతం లో రూపొందనుంది. ఈ మూడు సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కి తెలుగులో మరిన్ని వైవిధ్య మైన సినిమాలకి బాటలు వెయ్యాలని ఆశిద్దాం.