యూఎస్: డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు.
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనం రోటుండా ఆడిటోరియంలో ఈ ఘన కార్యక్రమం జరిగింది. ప్రపంచ నేతలు, టెక్ దిగ్గజాలు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తరపున లేఖను ట్రంప్‌కు అందించారు.
టెక్ దిగ్గజాలైన ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్ వంటి వారు కూడా హాజరై ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత బిజినెస్ మేగ్నేట్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ కూడా వేడుకలో ఆకర్షణగా నిలిచారు.
ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు.
“ఐ… డొనాల్డ్ ట్రంప్…” అంటూ ట్రంప్ తన ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం క్యాపిటల్ హిల్ భవనం వెలుపల శతఘ్నులతో గౌరవ వందనం సమర్పించారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టడం చారిత్రక ఘట్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుక ఆసక్తిగా చర్చనీయాంశంగా నిలిచింది.