వాషింగ్టన్: తమ దేశంలో కోవిద్- 19 కేసులు ప్రపంచంలోనే అధికంగా ఉన్నప్పటికీ, తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) నుండి ఉపసంహరించుకుంటున్నట్లు వైట్ హౌస్ అధికారికంగా ఐక్యరాజ్యసమితికి తెలియజేసింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏప్రిల్‌లో WHO కోసం US నిధులను స్తంభింపజేశారు. ఒక నెల తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ WHO తో తమ సంబంధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కరో నా వైరస్ వ్యాప్తిని నివారించడంలో WHO చైనాకు అనుకూలంగా, పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
WHO నిబంధనల ప్రకారం ఆ సంస్థ నుండి వైదొలగాలి అనుకునే ఏ దేశమైనా ఒక సంవత్సరం ముందుగా నోటీసు ఇవ్వాలి. ఉపసంహరణ నోటీసును ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు సోమవారం నాడు అందచేశారు. కాగా పూర్తి ఉపసంహరణ జూలై 6, 2021 న అమలులోకి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి మంగళవారం తెలిపింది.
ఇదిలా ఉండగా, ట్రంప్ నవంబర్ ఎన్నికల్లో ఓడిపోతే తదుపరి అధ్యక్షుడు WHO లో కొనసాగాలా వద్ద అని నిర్ణయించుకోవచ్చు. దీనికి ఊతమందిస్తూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ” నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను గెలిచి అధ్యక్షుడినైతే ప్రపంచ ఆరోగ్య సంస్థలో తమ దేశం మళ్ళీ చేరేలా చూస్తానని” పేర్కొన్నారు. అలాగే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అమెరికన్లకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదని సెనెటర్ బాబ్ మెనెండెజ్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆమె ఈ విధంగా తన ట్వీట్లో పేర్కొన్నారు – “కోవిద్-19 సమయం లో గందరగోళంగా మరియు అసంబద్ధంగా ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్థను ట్రంప్ యొక్క చర్యల ద్వారా న్యాయం చేయదని, ఇది అమెరికన్ జీవితాలను లేదా ఆసక్తులను రక్షించదు”
ప్రపంచ ఆరోగ్య సంస్థకు US సంవత్సరానికి 450 మిలియన్ డాలర్లకు పైగా ఆర్ధిక సహకారం అందిస్తుండగా, చైనా యొక్క ఆర్థిక సహకారం మాత్రం యుఎస్ యొక్క సహాయం లో పదవ వంతు గా వున్నది.
యునైటెడ్ స్టేట్స్ లో ప్రపంచంలోనే అత్యధికంగా, దాదాపు 3 మిలియన్ల మంది కరోనా బారిన పడగా, 131,000 మరణించారు. కాగా- అమెరికాలో మంగళవారం 46,329 కరోనా కేసులు నమోదయ్యాయి.