బట్లర్, పెనిస్ల్వేనియా: యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆయన బట్లర్ లో ప్రసంగం చేస్తున్న వేళ ఒక వ్యక్తి ట్రంప్ పై కాల్పులు జరిపారు.
కాగా ట్రంప్ చెవికి తాకి ఆ బుల్లెట్ దూసుకెల్లగా, ట్రంప్ వెంటనే పసిగట్టి నేలపై కూర్చున్నారు. వెంటనే అతని రక్షణా సిబ్బంది వచ్చి అతని చుట్టు ముట్టీ అక్కడి నుండి హాస్పిటల్ కు తరలించరు.
గాయం తరువాత ట్రంప్ తన మద్దతుదార్లకు ధన్యవాదాలు తెలుపుతూ కార్ ఎక్కి వెళ్ళారు. కాగా భద్రతా సిబ్బంది నిందితుడిని అక్కడే మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కు బాధ్యుడుగా భావిస్తున్న అతని పేరు మాథ్యివ్ క్రూక్స్ గా కనుగొన్నారు.
త్వరలో యూఎస్ లో ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ట్రంప్ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని అక్కడి సర్వే సంస్థలు తెలుపుతున్నాయి.
కాగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను ఖండించి, ఈ సమయంలో దేశం అంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ కు భారత ప్రధాని మోడీ సంఘీబావం తెలిపి ఈ దుశ్చర్యను ఖండించారు.