ముంబై: చైనాలో రూపొందించిన కొత్త AI మోడల్ డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ AI వినియోగంపై కీలక సూచనలు చేశారు.
గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, AIను సరైన మార్గంలో వినియోగించుకోవాలని, అయితే దీనికి బానిసలుగా మారొద్దని యువతకు సూచించారు.
“AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన తెలివితేటలను ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసిన తర్వాత జీవిత పాఠశాలలో అడుగు పెడతారు. అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, మీ అనుభవాలే గురువులు,” అని అంబానీ వివరించారు.
AI ఆధారంగా అభివృద్ధి చెందే తరం స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
భారత భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేసిన అంబానీ, 21వ శతాబ్దం ముగిసే నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని తెలిపారు.
AI ద్వారా యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని, ఈ రంగంలో భారతదేశం నాయకత్వం వహించాలని తన ఆశయాన్ని వ్యక్తం చేశారు.