fbpx
Friday, December 27, 2024
HomeLife Styleయూపీఐ పేమెంట్స్ రాత్రి సమయంలో చేయకండి

యూపీఐ పేమెంట్స్ రాత్రి సమయంలో చేయకండి

DONT-USE-UPI-MIDNIGHTS-ASKS-NPCI

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసేవారికి ఒక ముఖ్యమైన గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే కొన్ని రోజులు పాటు రాత్రిపుటా ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ చేయకండి అని యుపీఐ యూజర్లకు తెలిపింది.

కాగా ఆ కొన్ని రోజులు, ఎన్ని రోజులు అనేది స్పష్టంగా ఎన్‌పిసిఐ పేర్కొనలేదు. కేవలం “రాబోయే కొద్ది రోజులు” అని మాత్రమే పేర్కొంది. వినియోగదారులు ఎన్‌పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిదని, ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా తెలిపింది.

ఈ రోజుల్లో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ లావాదేవీల కోసం యుపీఐ యాప్ ల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్ యుపీఐ ప్లాట్‌ఫామ్‌లో 165 బ్యాంకులు లింక్ అయ్యి ఉన్నాయి. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులు చాలా భారీ మొత్తంలో పెరిగాయి. అంతేకాకుండా ఈ యుపీఐ యాప్ లో డిస్కౌంట్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి.

దీని వల్ల చాళా మంది వినియోగదారులను వీటికి ఆకర్షితులు అవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్‌లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు ఎన్‌పిసిఐ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular