మూవీడెస్క్: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చరణ్ తల్లిగా, అప్పన్న ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన భార్యగా అంజలి కీలక పాత్రలో నటించారు.
ట్రైలర్‌లో చూపించిన కట్స్ చూస్తే, అంజలికి స్క్రీన్‌పై మంచి స్కోప్ ఉండబోతుందని, ఆమె నటన క్లైమాక్స్‌లో హైలైట్ అవుతుందని శంకర్ ప్రస్తావించారు.
హీరోయిన్స్‌గా అవకాశాలు తగ్గిన ఈ సమయంలో అంజలికి ఇది మామూలు ఛాన్స్ కాదు.
ఇదే సమయంలో మరో విశేషం ఏమిటంటే, అంజలి నటించిన 2012 చిత్రం మదగజరాజ కూడా జనవరి 12న రిలీజ్ కాబోతోంది.
విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత విడుదలవుతోంది.
ఇందులో అంజలి గ్లామర్ టచ్ ఉన్న హీరోయిన్‌గా కనిపించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు.
ఈ చిత్రంలో విశాల్ స్వయంగా పాడిన పాట కూడా ప్రత్యేక ఆకర్షణ.
ఇక మదగజరాజ అనుకోకుండా సంక్రాంతి బరిలో దిగడంతో అంజలి రెండు వైపులా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
గేమ్ ఛేంజర్ లాంటి మెచ్యూర్డ్ రోల్, మదగజరాజ లాంటి మసాలా ఎంటర్టైనర్ అంజలికి మంచి గుర్తింపు తీసుకురావవచ్చని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో గీతాంజలి మళ్లీ వచ్చింది తో హిట్ కొట్టాలని ప్రయత్నించినా ఫలితం సరిగా రాలేదు.
గేమ్ ఛేంజర్ హిట్ అయితే అంజలికి మరో బ్రేక్ దక్కనుంది. సంక్రాంతి బరిలో ఇరువైపులా దొరుకుతున్న ఈ అవకాశాలు ఆమెకు జాక్‌పాట్ అయ్యే అవకాశముంది.