మూవీడెస్క్: కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన రవి బస్రూర్ ఇటీవల వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటున్నారు.
తెలుగు పరిశ్రమలో ‘మార్షల్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రవి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ సినిమాకు కూడా సంగీతం అందించారు.
కానీ ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
హిందీలో సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టిన రవి, తర్వాత అజయ్ దేవగన్ నటించిన ‘సింగం అగైన్’ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించారు.
అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రతిస్పందన అంతంత మాత్రమేగా ఉండటంతో రవి బస్రూర్‌కు ఈ ఏడాది పెద్ద విజయాలు దక్కలేదు.
ఈ ఏడాది తెలుగులో విడుదలైన గోపీచంద్ నటించిన ‘భీమా’ మరియు కన్నడలో ‘మార్టిన్’ చిత్రాలకు రవి బస్రూర్ సంగీతం అందించినా, ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి.
ప్రేక్షకులు రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను లౌడ్‌గా ఉందని విమర్శించారు.
అలాగే, సింగం అగైన్‌కి రవి అందించిన ఎలివేషన్ మ్యూజిక్ కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు లేకపోవడం గమనార్హం.
ఇప్పుడు రవి బస్రూర్ వచ్చే మలయాళ చిత్రం ‘మార్కో’ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆయనకు తిరిగి సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.