fbpx
Wednesday, February 5, 2025
HomeMovie Newsప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

DOUBLE-TREAT-FOR-PRABHAS-FANS-THIS-YEAR
DOUBLE-TREAT-FOR-PRABHAS-FANS-THIS-YEAR

మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన భారీ లైన్‌అప్‌తో అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం ఆరు సినిమాలు ఉండగా, ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజాసాబ్ ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా, జూన్ లేదా జులైలో థియేటర్లలో సందడి చేయనుంది.

మరోవైపు, కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్రుడుగా గెస్ట్ రోల్ పోషించనుండగా, ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.

ఈ రెండు సినిమాలు ఒకదాని వెంట ఒకటి రావడంతో, ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సినిమా ట్రీట్ దక్కనుంది.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఈ ఏడాది చివర్లో ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారు.

అలాగే, నాగ్ అశ్విన్ కల్కి 2898AD పార్ట్ 2 వచ్చే ఏడాది చివరిలో ప్రారంభం కానుంది.

ఇంతటి భారీ లైన్‌అప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సలార్ 2 కూడా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక వచ్చే ఏడాది ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో మూడు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular