మూవీడెస్క్: దేవర 2 పై అనుమానాలు! జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
అయితే తొలి షో తర్వాత నెగిటివ్ టాక్ వచ్చి, ఆపై మాస్ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.
ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత దేవర పై ట్రోల్స్ పెరిగాయి. కథ, పాత్రల స్కోప్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేవర 2 అవసరమా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు ఉద్ధృతంగా చర్చకు వచ్చాయి. అయితే కొరటాల శివ మాత్రం సీక్వెల్‌పై ఫోకస్ పెట్టారు.
ఎమోషన్స్‌ను ఎక్కువగా, యాక్షన్‌ను తక్కువగా చూపించేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
2025 జూలైలో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయాలనే మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు.
అయితే సీక్వెల్‌పై ఆసక్తి కోల్పోయిన ప్రేక్షకుల మనసును గెలవడానికి ఈసారి కొరటాల శివ కష్టపడాల్సి ఉంటుంది.
ఫస్ట్ పార్ట్‌లో జాన్వీ పాత్రపై ట్రోల్స్ ఎక్కువగా రావడంతో, సీక్వెల్‌లో కథానాయికకు బలమైన పాత్ర ఉండాలని మేకర్స్ దృష్టి సారించారు.
దేవర 2 తోపాటు, తొలి భాగం ఇచ్చిన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను అధిగమించి, భారీ విజయాన్ని సాధించాలంటే ప్రతి అంశంలో పరిపూర్ణత అవసరమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.