కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన సత్తా చాటాడు. లవ్ టుడే తర్వాత తాజాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ యూత్‌ఫుల్ లవ్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది.
సినిమా విడుదలైన మొదటి రోజే 12.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజుకే ఈ సంఖ్య 30 కోట్లను దాటింది. ఇక జెట్ స్పీడ్ లో వరల్డ్ వైడ్‌గా ₹100 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో కూడా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటన హైలైట్ కాగా, లియోన్ జేమ్స్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డబుల్ ప్రాఫిట్ దిశగా దూసుకెళ్తోంది. ప్రదీప్ మరోసారి హిట్ హీరోగా నిరూపించుకున్నాడు!