తమిళంలో ఘన విజయం సాధించిన ‘డ్రాగన్’ సినిమా తెలుగులోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది.
మరోవైపు, సందీప్ కిషన్ నటించిన ‘మజాకా’ అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. కథా కథనాలు ప్రేక్షకుల మెప్పు పొందలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
మౌత్ టాక్ సపోర్ట్ లేకపోవడంతో ‘మజాకా’ వసూళ్లు క్షీణించాయి. మొదటి వీకెండ్‌లో కూడా గ్రోత్త్ కనిపించలేదు. మరోవైపు ‘డ్రాగన్’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ సక్సెస్ జోరు కొనసాగిస్తోంది.
యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే మాస్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ‘డ్రాగన్’ సినిమాకు కలిసొచ్చాయి. ఇప్పుడు ఇదే ఊపుతో మరికొన్ని రోజులు మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.