న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కట్టడి కి ఇప్పటికే ప్రభుత్వం రెందు వ్యాక్సిన్ లకు అమోదం తెలిపింది. భారత్ బయోటెక్ నుండి వచ్చిన కొవాక్సిన్, సీరం నుండి వచ్చిన కోవీషీల్డ్ ఇప్పటికే చలా మంది భారతీయులకు వేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్, డీఆర్‌డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 ఔషధం ‘2– డీజీ’ మొదటి బ్యాచ్‌ను ఇవాళ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఇది నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతీ తెలిసిందే.
2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (క్లుప్తంగా 2–డీజీ) పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని కూడా ఇది తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ తెలిపింది.