fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsబాలీవుడ్ కి వెళ్తున్న 'దృశ్యం 2 '

బాలీవుడ్ కి వెళ్తున్న ‘దృశ్యం 2 ‘

Drishyam2 RemakeIn Bollywood

మాలీవుడ్: మలయాళం లో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ‘దృశ్యం’ సినిమా సూపర్ హిట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో వెంటకటేష్, తమిళ్ లో కమల్ హాసన్ , హిందీ లో అజయ్ దేవగన్ హీరోలుగా రూపొంది విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం 2 ‘ ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైంది. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీ లో విడుదలయ్యి దృశ్యం మొదటి భాగం కన్నా పెద్ద హిట్ టాక్ సంపాదించింది.

సినిమా విడుదలైన రెండు రోజులకే సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా తెలుగు రైట్స్ కొని నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేసారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల ఇంకొంచెం ఆలస్యం అయ్యేట్టు ఉంది. ఇపుడు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రూపొందనుంది. బాలీవుడ్ లో పనోరమా స్టూడియోస్ ఈ సినిమా హిందీ రైట్స్ కొని ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ పథక్, కుమార్ మంగత్ పథక్ వారి పనోరమా స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సినిమా లో నటించే హీరో, హీరోయిన్ అలాగే డైరెక్టర్ వివరాలు మరి కొద్దీ రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular