బాలీవుడ్: ప్రముఖ దర్శకుడు నిషికాంత్ ఈ రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్లో మృతి చెందారు. గత కొన్నిరోజుల నుండి కాలేయ సంబంధ వ్యాధితో బాధపడిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించడంతో మృతి చెందారు. ఈ ఏడాది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రకరకాల కారణాలతో మరణిస్తున్నారు. ఇదివరకే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి లెజెండ్స్ తర్వాత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు మరో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కన్నుమూశారు. ఈ సంఘటన ప్రస్తుతం బాలీవుడ్ లో విషాదకరంగా మారింది.
నిషికాంత్ ఇంతకుముందు అజయ్ దేవ్గన్-టబు నటించిన దృశ్యం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన మాదారీ, జాన్ అబ్రహం నటించిన ఫోర్స్ , రాకీ హ్యాండ్ సమ్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రితీష్ దేశ్ముఖ్ నటించిన ‘లై భారీ’ అనే మరాఠా చిత్రానికి నిషికాంత్ దర్శకత్వం వహించారు. మరాఠాలో ఆయన తెరకెక్కించిన డెబ్యూ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. డోంబివాలీ ఫాస్ట్ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన నిషికాంత్ మొదటి సినీమాతోనే నేషనల్ అవార్డు పొందారు.50యేళ్ళ వయసులోనే నిషికాంత్ మరణం పై బాలీవుడ్ మరాఠీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.