హైదరాబాద్: హైదరాబాద్ మహ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 250 కిలోల మత్తుమందును పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు.
మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందును రవాణా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం ఉందని తెలియడంతో, డీఆర్‌ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు.
హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ. 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తుమందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్ తిరిగి అధికారులకు పట్టుబడ్డాడు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన ముడి సరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.