మూవీడెస్క్: ఇతర భాషల నుంచి తెలుగులో డబ్బింగ్ సినిమాలు ఎంతటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, కార్తీ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి.
అలాగే కన్నడ నుంచి యష్, మలయాళం నుంచి మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు తమ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
తెలుగులో టాప్ కలెక్షన్లు సాధించిన డబ్బింగ్ చిత్రాల్లో రజినీకాంత్ జైలర్ ముందంజలో ఉంది.
ఈ చిత్రానికి దిల్ రాజు 12 కోట్ల థియేట్రికల్ రైట్స్ పెట్టగా, 35.90 కోట్ల ప్రాఫిట్ ఇచ్చింది.
అలాగే యష్ కేజీఎఫ్ చాప్టర్ 2, 50 కోట్ల బిజినెస్‌తో 84.25 కోట్ల భారీ లాభాలు అందుకుంది.
మరోవైపు కన్నడ చిత్రమైన కాంతారా గీతా ఆర్ట్స్‌కు కేవలం 2 కోట్లతో 27.65 కోట్ల ప్రాఫిట్ తెచ్చింది.
ఈ చిత్రాలు మాత్రమే కాకుండా అమరన్ మరియు బిచ్చగాడు సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధించాయి.
అమరన్ 5 కోట్ల బిజినెస్‌తో 23 కోట్ల లాభాన్ని అందించగా, బిచ్చగాడు కేవలం 50 లక్షల బిజినెస్‌తో 16.30 కోట్ల ప్రాఫిట్ రాబట్టింది.
ఇవి కాకుండా, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులో వసూళ్ల పరంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి.
ఈ విజయాలు డబ్బింగ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను, ప్రేక్షకుల ఆదరణను స్పష్టం చేస్తాయి.