fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఅప్పుడో ఇప్పుడో ఎప్పుడో కు డల్ ఓపెనింగ్స్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కు డల్ ఓపెనింగ్స్

DULL-OPENINGS-FOR-APPUDO-IPPUDO-EPPUDO
DULL-OPENINGS-FOR-APPUDO-IPPUDO-EPPUDO

మూవీడెస్క్: ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్, ఇటీవల తన కొత్త సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

కానీ ఆశించిన స్థాయిలో సినిమా ప్రమోషన్స్ లేకపోవడం, ఎలాంటి హడావుడి చేయకపోవడంతో ఈ సినిమాకి తగినంత రెస్పాన్స్ రాలేదు.

దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ విడుదల చేసినా, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం, సడెన్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం పరిశ్రమలోని అనేక మందిని ఆశ్చర్యపరిచింది.

నిఖిల్ రేంజ్‌కు తగిన ప్రమోషన్లు లేకపోవడం వల్లే ఈ చిత్రానికి డల్ ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు.

100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా భావించబడే నిఖిల్ సినిమాలకు తగిన ప్రమోషన్ ఉంటే, బజ్ కూడా పెరిగి మంచి ఓపెనింగ్స్ సాధించడం సాధ్యం అయ్యేది.

మరి ఈ సినిమాకి ఎందుకు సరైన ప్రమోషన్ జరగలేదు?

నిఖిల్ వంటి హీరోను పాన్ ఇండియా స్థాయిలో ఎదగాలనుకున్నప్పుడు ఆ స్థాయి ప్రమోషన్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular