టాలీవుడ్: మళయాళ నటుడే అయినా తన సినిమాలతో సౌత్ తో పాటు హిందీ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు డుల్కర్ సల్మాన్. ప్రస్తుతం డుల్కర్ సినిమా వస్తుందంటే మళయాళం తో పాటు మరో నాలుగు ఐదు భాషల్లో ప్రేక్షకులు ఆ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా డుల్కర్ కూడా సమయం వచ్చినపుడు తమిళ్ లో తెలుగు లో డైరెక్ట్ రోల్స్ చేస్తూ అక్కడి అభిమానుల్ని అలరిస్తున్నాడు.
టాలెంట్ ఉండి కంటెంట్ ఫుల్ సినిమాలు తీసినా ఎందుకో తెలియదు ఆయన తీసిన సినిమాలు కొందరు సినీ అభిమానుల దగ్గరినుండి మంచి మెప్పు పొందుతాయి కానీ కమర్షియల్ గా అంత హిట్ అవ్వవు. ఆయనే హను రాఘవపూడి. హను సినిమాల కోసం ఒక ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు.
మహానటి లో మెప్పించిన డుల్కర్ మరో సారి మహా నటి సినిమాని నిర్మించిన వైజయంతి వారి ‘స్వప్న సినిమాస్’ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధం తో రాసిన ప్రేమ కథ’ అనే డైరెక్ట్ తెలుగు మూవీ లో నటిస్తున్నాడు. డుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి చిన్న టీజర్ విడుదల చేసారు. ఈ సినిమాలో డుల్కర్ ‘లెఫ్టినెంట్ రామ్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పీరియాడిక్ నేపథ్యం లో రూపొందుతుంది. సైనికుడిగా ఉన్న డుల్కర్ లుక్ ఈ వీడియో లో చూపించారు. టీజర్ లో విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మిగతా అప్ డేట్స్ తెలియాల్సి వుంది.