మూవీడెస్క్: మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ అందుకుంటున్నాడు.
సీతారామం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరి మరో ఘన విజయాన్ని అందుకున్నాడు.
కథల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకత చూపే దుల్కర్, ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈసారి దుల్కర్ పక్కన అందాల తార పూజా హెగ్డే కనిపించనుంది. ఇద్దరూ కలిసి తొలిసారి తెరపై సందడి చేయబోతున్నారు.
ఈ సినిమాను దసరా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.
కొత్త దర్శకుడు రవితో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న రవి, ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు.
షూటింగ్ డిసెంబర్ 11న మొదలుకానుండగా, ఈ సినిమాకు వినూత్నమైన ప్రేమకథతో పాటు కొత్త మలుపులను జోడించనున్నట్లు సమాచారం.
దుల్కర్ స్టైల్ కి తగ్గ కథను తయారుచేసిన రవి, పూజా హెగ్డే అందంతో పాటు అభినయానికి స్కోప్ కల్పించే పాత్రను డిజైన్ చేశాడట.
ఈ జంట తొలిసారి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దుల్కర్ కంటెంట్ బేస్డ్ చిత్రాలకు నమ్మకం ఉంచడమే కాకుండా, కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం అందించడం విశేషం.
ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.