మాలీవుడ్: మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడిగా పరిచయం అయ్యి మెల్ల మెల్లగా మార్కెట్ పరిధిని పెంచుకుంటూ సౌత్ లో అన్ని భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తున్న ‘కురుప్’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ని ఐదు భాషల్లో విడుదల చేసింది సినిమా టీం.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కనిపించబోతున్నాడు. ’36 సంవత్సరాలు, మూడు వందలకు పైగా టిప్ ఆఫ్స్, వెయ్యికి పైగా ప్రయాణాలు, ఇదంతా ఒకరి కోసం’.. అంటూ తన కారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇచ్చి సుకుమార కురుప్ అని తన పేరు చెప్పి టీజర్ ముగించారు. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీ గా గూఢచారి సినిమాలో నటించిన తెలుగమ్మాయి ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తుంది.
దుల్కర్ సల్మాన్ సమర్పణలో వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ బానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సుషిన్ శ్యామ్ సంగీతం తో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో త్వరలో తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.