
హైదరాబాద్: మమ్ముట్టి కొడుకుగా మలయాళం సినీ ఇండస్ట్రీ లో హీరో గా ప్రయాణం ప్రారంభించి తక్కువ సమయంలో దాదాపు ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న నటుడు డుల్కర్ సల్మాన్. తాను తీసే మలయాళం సినిమాలకి కూడా ఓటీటీ ల్లో మంచి బజ్ ఉంది. అలాగే డుల్కర్ నటనకి, లుక్స్ కి చాలా మంది ఫాన్స్ కూడా ఉన్నారు. తెలుగులో డైరెక్ట్ గా ఇప్పటివరకు ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర చేసాడు డుల్కర్. తర్వాత కనులు కనులను దోచాయంటే డబ్ అయ్యి మంచి టాక్ తోనే నడిచింది. ఈరోజు డుల్కర్ పుట్టినరోజు సందర్భంగా తన తర్వాతి తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.
‘లెఫ్టినెంట్’ రామ్ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ.. అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ‘అందాల రాక్షసి’,’కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’, ‘పడి పడి లేచే మనసు’. ‘లై’ లాంటి విభిన్న సినిమాల డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. డుల్కర్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం సౌత్ భాషల్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాతో పాటు డుల్కర్ మలయాళం లో నటిస్తున్న మరో సినిమా ‘కురుప్’ టీజర్ ని విడుదల చేసారు ఆ సినిమా టీం. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా ఈ సినిమాని కూడా తానే నిర్మిస్తున్నాడు.