జాతీయం: ఆంధ్రా, బిహార్‌లో విద్యా హక్కు లేదని దురై మురుగన్ వ్యాఖ్య
తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ (Durai Murugan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), బిహార్ (Bihar) రాష్ట్రాల్లో ఇప్పటికీ మహిళలకు పూర్తి స్థాయిలో విద్యా హక్కు (Right to Education) అమలు కాకపోవడం విచారకరమని అన్నారు.
తమిళనాడులో తందై పెరియార్ (Thanthai Periyar) చేసిన పోరాటాల వల్ల మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందని, ఆంధ్రా, బిహార్‌లో మాత్రం మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు.
దురై మురుగన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.