పోలింగ్ డేటా తారుమారైందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి లోపాలు లేవని, అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు.
‘లోక్‌సభ 2024 అట్లాస్’ ఆవిష్కరణలో మాట్లాడిన రాజీవ్ కుమార్, ఎన్నికల ప్రక్రియలో లక్షల మంది అధికారులు పనిచేస్తారని, ఈ స్థాయిలో పొరబాట్లు జరగడం అసాధ్యమని తెలిపారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇటీవల విపక్షాలు పోలింగ్ డేటాలో తేడాలు ఉన్నాయంటూ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ కుమార్ మరోసారి ఈసీ స్టాండ్‌ను స్పష్టంగా తెలిపారు.
పోలింగ్ డేటా పునఃసమీక్షలు టెక్నాలజీ ఆధారంగా పకడ్బందీగా జరుగుతాయని, అవినీతి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈసీ వివరణకు విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.