fbpx
Sunday, January 19, 2025
HomeLife Style100 బిలియన్‌ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్‌

100 బిలియన్‌ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్‌

ECOMMERCE-INDUSTRY-REACHES-100BILLIONS-NEXT-3YEARS

న్యూఢిల్లీ: భారత దేశంలో రానున్న మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్‌ పరిశ్రమ దాదాపు 90-100 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. భారత్ లో కరోనా రాక ముందు ఈ-కామర్స్‌ వృద్ధి రేటు 26-27 శాతం వరకు ఉండేదని, కానీ అది కరోనా తర్వాత 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

పొరుగు దేశం అయిన చైనా ఆన్‌లైన్‌ మార్కెట్లో ఈ-కామర్స్‌ వాటా 25 శాతంగా ఉంటే.. ఇండియాలో 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 10-25 శాతమని చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ ఆధునిక రిటైల్‌ మార్కెట్ల కంటే చాలా పెద్దగా ఉంటుందన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని, దీని వల్ల ఈ-కామర్స్‌ రంగం వృద్ధి చోదకాలుగా మారుతాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఎంత ప్రభావితం అయ్యాయో, అంతే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కిరాణా వ్యవస్థలో అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆధునిక రిటైల్‌ మంచి బిజినెస్‌ అవకాశమని, స్మాల్‌ బిజినెస్, చేతివృత్తులు వంటివి డిజిటల్‌ రిటైల్‌తో మంచి చాన్స్‌లుంటాయని అన్నారు.

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ ఈ దిశలో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 2019లో దేశ జనాభాలో 10 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరిపారని . లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండాల్సి రావటంతో కిరాణా, నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్‌ మీద ఆధారపడ్డారని, లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో వంద పిన్‌కోడ్స్‌లో ఈ-కామర్స్‌ ఆర్డర్లు వస్తున్నాయని, 60 శాతానికి పైగా లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరుగుతున్నాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular