చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎస్.జగత్రక్షకన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ జరిమాన విధించింది.
ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులకు కలిపి రూ. 908 కోట్ల భారీ జరిమానాను విధించింది.
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారన్న కేసులో ఈడీ ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టంగా తెలిపింది.
కాగా, ఈ నెల 26వ తేదీన వచ్చిన తీర్పుకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది.
ఇక ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ ప్రకారం 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో జప్తు చేసిన రూ. 89.19 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి తమకు ఆదేశాలు ఉన్నాయని, ఈ మొత్తాన్ని కూడా జరిమానాలో కలిపినట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా, వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయి కొనసాగుతున్నారు.