టాలీవుడ్: ‘వెళ్ళిపోమాకే’ అనే క్లాస్ సినిమాతో పరిచయం అయ్యి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘ఫలక్నుమా దాస్’ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకుని దూసుకెళ్తున్నారు విశ్వక్సేన్. మూడవ సినిమాకే నిర్మాతగా, డైరెక్టర్ గా చాలా పాత్రలు పోషించి ఇక్కడ ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్ళడానికి రాలేదు చాలా రోజులు ఉంటానని అని హింట్స్ ఇచ్చాడు. తర్వాత నాని నిర్మించిన ‘హిట్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా ‘పాగల్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ విడుదల చేసారు.
‘ఈ సింగిల్ చిన్నోడే’ అంటూ సాగే ఈ పాట ఈరోజు సాయంత్రం విడుదలైంది. ‘ఈ సింగిల్ చిన్నోడే.. న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే.. సిగ్నల్ గ్రీనే చూసాడే.. పరుగులు పెట్టాడే’ అంటూ రైమింగ్ తో సాగె ఈ పాట ఆకట్టుకుంది. ఇదివరకే ఈ సినిమా నుండి ‘గూగులు గూగులు’ అంటూ సాగే పాట రామ్ మిరియాల స్వరంతో సూపర్ హిట్ అయింది. ‘ఈ సింగిల్ చిన్నోడే’ పాటని రధాన్ సంగీతంలో బెన్నీ దయాళ్ ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ కి జతగా నివేత పేతురాజ్, సిమ్రాన్ చౌదరి నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నరేష్ కొప్పల్లి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. మే లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన ఆలస్యం అయింది. సెకండ్ వేవ్ తగ్గాక ఈ సినిమా టీం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.