టాలీవుడ్: యూవీ క్రియేషన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తూ ఇప్పటివరకు అన్ని హై బడ్జెట్ సినిమాలు రూపొందించిన బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ పేరుతో కొత్త వాళ్ళని, చిన్న సినిమాలని రూపొందించడం ప్రారంభించింది. ఈ కొత్త బ్యానర్ పై ‘ఏక్ మినీ కథ‘ అనే సినిమా రూపొందించారు. థియేటర్లలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ రోజు ఓటీటీ లో విడుదలైంది.
చిన్నప్పటినుండి తనలో ఒక లోపం ఉందని హీరో మదనపడుతుంటాడు. ఆ విషయం ఎవ్వరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే నలుగురూ ఏమనుకుంటారో అనే భావంతో తన లోపాన్ని సరి చేసుకోవడానికి మార్గాలు వెతుకుతుంటారు. ఈ క్రమంలో హీరో కి పెళ్లి సెట్ అవుతుంది. మరి ఆ లోపం గురించి హీరోయిన్ కి చెప్పాడా , లోపాన్ని సరిచేసుకున్నాడా ఈ క్రమం లో హీరో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది సినిమా కథ. మేర్లపాక గాంధీ రాసుకున్న కథ టీజర్స్, ట్రైలర్స్ చూస్తే క్లియర్ గా అర్ధం అవుతూ ఉంది. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు, మరి కొత్త డైరెక్టర్ ఈ కథని ఎలా ప్రెసెంట్ చేసాడు అనే దాని పైన సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
సినిమా కథనం మొదటి గంట సేపు వినోదం గా వెళ్తుంది. అది కూడా లౌడ్ గా చెప్పలేం కానీ ఎదో పరవాలేదనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ గా సుదర్శన్, ఫాదర్ కారెక్టర్ బ్రహ్మాజీ ద్వారా కొంత నవ్వించడానికి ట్రై చేశారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత మరీ నీరసం వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ చూసి అసలు సెన్స్ లేకుండా ఎలా చేసారు అనిపిస్తుంది. యూవీ వారు ఇలాంటి కథనాన్ని ఎలా ఓకే చేసారు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ని సీరియల్ గా సాగదీసినట్టు చెప్పి చివర్లో ఒక మెసేజ్ తో సినిమా ముగించారు. ఇలాంటి బోల్డ్ కథ లు హిందీ లో విక్కీ డోనర్ లాంటి సినిమాతో ప్రారంభం అయ్యాయి. తెలుగులో కూడా ఇది మొదటి ప్రయత్నం అని చెప్పవచ్చు కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం శ్రమించాల్సిందేమో, కథనం విషయం లో స్క్రిప్ట్ ఇంకొంచెం మెరుగులు దిద్దితే బాగుందనిపించింది. అయినప్పటికీ ఇలాంటి బోల్డ్ కథని ఎలాంటి వల్గారిటీ లేకుండా చెప్పారు. ఒక మెయిన్ సినిమాలో కామెడీ ట్రాక్ లో పెట్టాల్సిన స్టోరీ లైన్ ని ఫుల్ మూవీ తీశారు అనిపిస్తుంది.
టెక్నిషియన్స్ లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగానే కుదిరాయి. ఉన్న రెండు, మూడు పాటలు బాగానే ఉన్నాయి. ‘ఐబాబోయ్ పడిపోతున్నానే’ అనే పాట గుర్తుండిపోతుంది. సినిమా నిర్మాణ విలువలు ఎక్కడా తక్కువ లేనప్పటికీ యూవీ వారు వారి బ్యానర్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని రూపొందించలేదనిపిస్తుంది.
నటీనటుల లో హీరో సంతోష్ శోభన్ కి మంచి మార్కులు పడ్డాయి అని చెప్పొచ్చు. చాలా ఈజ్ తో ఈ పాత్రని చేసుకుపోయాడు సంతోష్. కొన్ని మంచి సినిమాలు పడితే ఇండస్ట్రీ లో చాలా రోజులు ఉంటాడు ఈ హీరో అని చెప్పవచ్చు. సినిమాలు చేయడం మాత్రమే కాకుండా గుర్తుండిపోయే నటన కూడా ప్రదర్శించగలడు అనిపించాడు. హీరోయిన్ కావ్య థాపర్ మిగతా నటులు బ్రహ్మాజీ, హర్ష వర్ధన్, సుదర్శన్, శ్రద్ధ దాస్, సప్తగిరి తమ పాత్రల వరకు ఎలాంటి లోపాలు లేకుండా చేసుకుంటూపోయారు.
పోజిటివ్స్:
సంతోష్ యాక్టింగ్
బోల్డ్ స్టోరీ
నెగిటివ్స్ :
కథనం
డైరెక్షన్
పూర్ కామెడీ
లాగింగ్ సెకండ్ హాఫ్