fbpx
Sunday, April 27, 2025
HomeMovie Newsవాయిదా పడిన 'ఏక్ మినీ కథ'

వాయిదా పడిన ‘ఏక్ మినీ కథ’

EkMiniKatha MovieRelease Postponed

టాలీవుడ్: జనవరి లో థియేటర్ లు తెరుచుకున్న తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా హిట్లు నమోదయ్యాయి. ఇపుడిపుడే పెద్ద హీరోల సినిమాలు మొదలవ్వబోతున్న సమయం లో ఏప్రిల్ లో సెకండ్ వేవ్ కారణంగా జనాలు థియేటర్లకు వచ్చే సూచనలు లేకపోవడం తో ముందుగా డేట్స్ ప్రకటించిన సినిమాలు వాయిదా వేసుకున్నాయి. ఐతే అదే ప్లేస్ లో ‘ఇష్క్’ మరియు ‘ఏక్ మినీ కథ’ లాంటి చిన్న సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి. కానీ పరిస్థితి మరింత దిగజారడంతో థియేటర్లు మూసివేసే పరిస్థితి రావడంతో ఇపుడు ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా వేస్తున్నారు. పోయిన వారం విడుదల అవ్వాల్సిన ఇష్క్ మూవీ వాయిదా వేశారు.

ఇప్పుడు ఈ వారం విడుదల అవ్వాల్సిన ‘ఏక్ మినీ కథ’ సినిమా కూడా వాయిదా వేస్తూ ఒక వీడియో రూపొందించి విడుదల చేసారు. మాస్క్ ఎంత ముఖ్యమో చెప్తూ అలాగే ఈ సినిమా కూడా ఇపుడు విడుదల చేసే పరిస్థితి లేకపోవడం తో సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా విడుదల తేదీ కూడా తర్వాత చెప్తాము అందరూ ఇంట్లోనే ఉండి జాగ్రత్త గా ఉండమని వీడియో ముగించారు. పేపర్ బాయ్ ద్వారా గుర్తింపు పొందిన సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది.

Ek Mini Katha Update 4 | #EkMiniKathaPostPoned | Santosh | Kavya Thappar | Merlapaka Gandhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular