fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఏప్రిల్ నెలాఖర్లో 'ఏక్ మినీ కథ '

ఏప్రిల్ నెలాఖర్లో ‘ఏక్ మినీ కథ ‘

EkMiniKatha ReleaseDate Announcement

టాలీవుడ్: ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయం అయ్యి, ‘తాను నేను’ సినిమా ద్వారా హీరోగా తొలి అడుగులు వేసి ‘పేపర్ బాయ్’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘సంతోష్ శోభన్’. ఈ నటుడు ఎవరో కాదు ప్రభాస్ కి తొలి హిట్ అందించిన ‘వర్షం‘ డైరెక్టర్ శోభన్ కుమారుడు. ఈ హీరో ప్రస్తుతం యూవీ వారి బ్యానర్ లో ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా చేసాడు. గత కొద్దీ రోజులుగా ప్రొమోషన్ చేస్తున్న ఈ సినిమా టీం మూవీ విడుదల తేదీ ని ప్రకటించింది. ఏప్రిల్ 30 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాలు వెనక్కి తగ్గడంతో మొన్న ‘ఇష్క్‘ ఇవాల ‘ఏక్ మినీ కథ ‘ ఆ డేట్స్ ని లాక్ చేసుకుని సినిమాలు విడుదల చేస్తున్నాయి.

‘ఏక్ మినీ కథ’ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లాగ రూపొందింది. హీరో బాడీ లోని ఒక వీక్నెస్ ని బేస్ చేసుకుని దాని చుట్టూ కామెడీ కలిగించేలా ఈ సినిమా రూపొందించినట్టు సినిమా టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘వేంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’ సినిమాలని రూపొందించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథ అందించాడు. యూవీ వారి యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించారు. కార్తీక్ రాపోలు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటింస్తుంది. మరిన్ని పాత్రల్లో శ్రద్ధ దాస్, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular