టాలీవుడ్: యూవీ క్రియేషన్స్ వారి యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన సినిమా ‘ఏక్ మినీ కథ’. ఏప్రిల్ 24 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన థియేటర్లు మూతబడిపోవడం తో ఓటీటీ లో విడుదల అవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. శరీరం లో ఒక పార్ట్ లో ఉన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని దాని చుట్టూ హాస్యం క్రియేట్ చేసే ఎంటర్టైనర్ ఈ సినిమా అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కొంచెం రొమాంటిక్ మరియు ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. హీరోకి తన ఒంట్లో ఉండే ఒక భాగానికి సంబందించిన ప్రాబ్లం తో చిన్నప్పటినుండి తనలో తానే మధనపడుతూ ఉంటాడు.
పెద్దయ్యాక ఆ ప్రాబ్లం రిలేటెడ్ పరిష్కారం కోసం సర్జరీ కి కూడా సిద్ధం అవుతాడు. మరి ఆ తర్వాత ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి , ఎలాంటి కామెడీ జెనెరేట్ చేశారు, ఎమోషన్స్ ఎలా పండించారు లాంటి విషయాలు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. మరిన్ని పాత్రల్లో బ్రహ్మాజీ, శ్రద్ధ దాస్, సుదర్శన్, సప్తగిరి నటించారు. ఈ సినిమాని కార్తీక్ రాపోలు అనే నూతన దర్శకుడు రూపొందించాడు.మే 27 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమ్ అవనుంది.