టాలీవుడ్: ప్రస్తుతం సోషల్ మీడియా లో మీమ్స్ బాగా ఫేమస్ అయిపోయాయి. ఒక పేజీ మొత్తం రాసి పబ్లిష్ చేయడం కన్నా ఒక చిన్న మీమ్ చేసి విడుదల చేస్తే జనాలకి ఈజీ గా అర్ధం అవడం తో పాటు రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మీమ్ క్రియేట్ చేయడం లో కూడా సృజనాత్మకత చూపించాలి లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఒకర్ని పైకి లేపాలన్న, కిందకి తొక్కేయాలన్న మీమ్స్ ఇపుడు బాగా వాడుతున్నారు . సినిమా పబ్లి సిటీ కోసం, రక రకాల ప్రమోషన్స్ కోసం మీమ్స్ వాడుతున్నారు. అయితే ‘ఏక్ మినీ కథ’ సినిమా టీం కొన్ని టెంప్లేట్స్ క్రియేట్ చేసి ఇలాంటివి యూస్ చేసి సినిమా పై మీమ్స్ క్రియేట్ చేయమని షేర్ చేసింది.
మామూలుగానే మీమర్స్ కొత్త కొత్త టెంప్లెట్స్ యూస్ చేసి పోస్ట్ చేస్తుంటారు. ఇలా ఒక థీమ్ ఇచ్చి శాంపిల్ ఇచ్చి చేయమంటే వాళ్ళు ఇంకా చెలరేగిపోతారు. ఎలా చూసుకున్నా ఈ సినిమాకి ప్రొమోషన్ మాత్రం జరుగుతుంది. యూవీ కాన్సెప్ట్ వారి ఈ ఆలోచన మంచిగా ఉందని ప్రొమోషన్ ఐడియా గా ఫ్యూచర్ లో వేరే నిర్మాతలు కూడా వాడుతారేమో. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ కథతో దినేష్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ రోజు రాత్రి నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనుంది.