‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ఎల్లమ్మ కోసం సిద్ధమవుతున్నాడు. పూర్తి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించబోతున్నాడు.
హీరోయిన్ విషయంలో మొదటి నుంచి పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొదటిగా సాయి పల్లవి పేరుతో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే డేట్స్ సమస్య కారణంగా ఆమె ఈ అవకాశం వదులుకున్నట్టు సమాచారం.
తాజాగా కీర్తి సురేష్ ఈ చిత్రానికి ఫైనల్ అవుతుందని వార్తలు వచ్చాయి. ‘బలగం’ తరహా భావోద్వేగ గాథలో కీర్తి నటిస్తే మంచి హైప్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
కీర్తి సురేష్ తన ఇతర ప్రాజెక్ట్స్ డేట్స్ కారణంగా ఎల్లమ్మ సినిమాకు నో చెప్పినట్లు సమాచారం. దాంతో మళ్లీ కొత్త హీరోయిన్ కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎమోషనల్ డ్రామాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా, మంచి కాస్టింగ్‌తో ముందుకెళ్లాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.