fbpx
Sunday, November 24, 2024
HomeInternationalసూపర్ చార్జర్లను ఎవరైనా వాడుకోవచ్చన్న ఎలాన్ మస్క్!

సూపర్ చార్జర్లను ఎవరైనా వాడుకోవచ్చన్న ఎలాన్ మస్క్!

ELONMUSK-ALLOWS-SUPERCHARGER-NETWORK-TO-BE-USED-BY-OTHER-ELECTRIC-VEHICLES

వాషింగ్టన్‌: ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఇవాళ ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. టెస్లా తయారుచేసిన ఎలక్ట్రిక్‌ వాహనాలకు వాడే తమ సూపర్‌చార్జర్ల నెట్‌వర్క్‌ను మరే ఇతర కంపెనీల ఎలక్ట్రిక్‌ వాహనాలైనా వినియోగించుకోవచ్చు అని ఎలన్‌ మస్క్‌ తెలిపారు.

టెస్లా కంపెనీ వారి సూపర్‌ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడుకునేందుకు ఈ ఏడాది చివర్లో తెరవాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో అందుబాటులో ఉన్న తమ సూపర్‌ ఛార్జర్ల నెట్‌వర్క్‌లను ఇతర‌ వాహనాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని టెస్లాకు ఆదేశించారు.

ప్రపంచం మొత్తం మీద టెస్లాకు సుమారు 25 వేల సూపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. కాగా జూన్ నెలలో జర్మనీ రవాణా శాఖ మంత్రి టెస్లాకు చెందిన సూపర్‌ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడుకునే విషయంపై టెస్లాతో చర్చించారు. ఇంకో వైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సుమారు 7.5 బిలియన్‌ డాలర్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల మౌలిక సదుపాయాలను, ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే పలు ఛార్జింగ్ కంపెనీలు బ్లింక్ ఛార్జింగ్, ఈవీగో, ఛార్జ్‌పాయింట్ హోల్డింగ్స్, వోక్స్‌వాగన్ కు చెందిన ఎలక్ట్రిక్ ఫై అమెరికా కూడా యునైటెడ్ స్టేట్స్ అంతటా ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular