న్యూఢిల్లీ: ఇటీవల జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్న్మ కొద్ది రోజులకే మళ్ళీ ఎలాన్ మస్క్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు.
తద్వారా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మళ్లీ రెండో స్థానానికి పడీపోయారు. ఎలాన్ మస్క్ తనకి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ మరియు ఇతర ఇన్వెస్టర్ల ద్వారా దాదాపు 850 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు.
తాజాగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ యొక్క సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు పెరిగి 199.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన మళ్ళీ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్ టాప్ బిలియనీర్‌గా నిల్చారు.