టాలీవుడ్: ఈ సంవత్సరం థియేటర్లు తెరచి ఉంది సినిమాలు విడుదల అయింది కేవలం రెండున్నర నెలలే. కాబట్టి హీరోల దగ్గరి నుండి కానీ, డైరెక్టర్ ల దగ్గరినుండి కానీ విడుదల అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి కష్టకాలం లో కూడా ఆర్జీవీ చాలా సినిమాలే విడుదల చేసాడు అది వేరే విషయం. కానీ ఇలా ఈ సంవత్సరం లో వచ్చిన సినిమాల నెంబర్ ని బట్టి కాకుండా సినిమా ఎంత విజయవంతం అయింది అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని ఒక డైరెక్టర్ ని ఎమర్జింగ్ డైరెక్టర్ గా ఎంచుకున్నాం. ఈ సంవత్సరం ద్వితీయార్థం లో ఆహా ఓటీటీ లో ‘కలర్ ఫోటో’ అనే ఒక సినిమా విడుదలైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉండే సుహాస్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా ఈ సినిమా రూపొందింది.
ఒక సాధారణ సినిమా గా విడుదలైన ఈ సినిమా అసాధారణ విజయం సాధించింది. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ రాసిన మాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఒక కొత్త దర్శకుడిగా వచ్చేప్పుడు ఎవరైనా ఇంకా కొత్త రకమైన కథతో ప్రయత్నం చేసారు. కానీ సందీప్ రాజ్ ఒక మామూలు కథని ,చాలా మందికి తెలిసిన కథని మంచి సంభాషణలతో, హృదయానికి హద్దుకునే భావోద్వేగాలతో నింపి సినీ అభిమానుల హృదయాల్ని టచ్ చేసాడు. తనకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్ పరిమితులలో ఒక పీరియాడిక్ సినిమాని అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే సినిమా సక్సెస్ కూడా అదే రేంజ్ లో వరించింది.ఇంకా తరువాతి సినిమా ఏదీ అధికారికంగా ప్రకటించినప్పటికీ మరి కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నట్టు అయితే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ డైరెక్టర్ ని ఈ సంవత్సరం ఎమర్జింగ్ డైరెక్టర్ గా ఎంచుకున్నాం.