టాలీవుడ్: ఈ సంవత్సరం థియేటర్లు తెరచి ఉండి సినిమాలు విడుదల అయింది కేవలం రెండున్నర నెలలే. కాబట్టి హీరోల దగ్గరి నుండి కానీ, డైరెక్టర్ ల దగ్గరినుండి కానీ విడుదల అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి కష్టకాలం లో కూడా ఆర్జీవీ చాలా సినిమాలే విడుదల చేసాడు అది వేరే విషయం. కానీ ఒక హీరో మాత్రం తన దగ్గరి నుండి ఒక మూడు సినిమాలు ఓటీటీ ల ద్వారా విడుదల అయ్యేలా చూసుకున్నాడు. ఆ విడుదలైన సినిమాల్లో కొన్ని జనాలని అమితంగా ఆకట్టుకుని ఓటీటీ లో విడుదలైన ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొంది తన పాత సినిమాలకి కూడా ఈ లాక్ డౌన్ లో వ్యూస్ పెంచుకుని ఈ సంవత్సరం ఎమర్జింగ్ హీరో ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు.
ఇప్పటివరకు మనం చెప్పుకుంటుంది అప్ కమింగ్ టాలెంటెడ్ హీరో ‘సత్యదేవ్‘ గురించి. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ’47 డేస్’, ‘గువ్వ గోరింక’ లాంటి సినిమాలని ఈ సంవత్సరం ఓటీటీ లో విడుదల చేసాడు. అంతే కాకుండా ‘లాక్డ్’ లాంటి వెబ్ సిరీస్ ని కూడా జీ 5 లో విడుదల చేసి సక్సెస్ సాధించాడు. ఈ సినిమాల్లో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ మంచి హిట్ టాక్ సాధించి సత్యదేవ్ కి మరింత పేరు మరియు సినిమాలని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సత్యదేవ్ ‘తిమ్మరుసు’ మరియు ‘గుర్తుందా శీతాకాలం’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇంతే కాకుండా తాను తీసిన బ్లఫ్ మాస్టర్ సినిమా ద్వారా మెగాస్టార్ ప్రశంసలు కూడా పొందాడు.