‘లూసిఫర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఎల్ప్ 2: ఎంపురాన్ సినిమా మలయాళ చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లనుంది. మోహన్‌లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో భారీ హైప్ ఏర్పడింది.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో అనూహ్య వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాతగా వ్యవహరిస్తున్న మోహన్‌లాల్ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడంతో, ప్రొడక్షన్ ఖర్చు 75-80 కోట్ల మధ్యగా ముగిసిందని సమాచారం. కానీ మార్కెటింగ్, వీఎఫ్‌ఎక్స్, పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ఖర్చులు కలిపితే మొత్తంగా బడ్జెట్ 130-150 కోట్ల వరకు వెళ్లినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బుక్ మై షో ప్రీ సేల్ లోనే ఇప్పటికే 50 కోట్ల మార్క్ అందుకునే దిశగా ఉందన్న సమాచారం వైరల్ అవుతోంది. మలయాళ సినిమా మొదటిసారి ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం సంచలనం. ఇది ‘బాహుబలి’, ‘పుష్ప’ తరహా సినిమాల లెవెల్‌కి మలయాళాన్ని చేర్చినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
రాజకీయం, మాఫియా, ఇంటెలిజెన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఎంపురాన్ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మోహన్‌లాల్ మాస్ అవతార్‌తో పాటు పృథ్వీరాజ్ టేకింగ్‌కి సంబంధించిన అంచనాలు మరింత పెరుగుతున్నాయి.