బెంగుళూరు: కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ, సీనియర్ నటి సుమలత దర్శన్ గురించి స్పందిస్తూ, దర్శన్ ఎప్పటికీ తన కుమారుడిలానే ఉంటాడని, గతంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు.
సుమలత, దర్శన్ భార్య విజయలక్ష్మితో నిత్యం సంభాషిస్తూ అతని ఆరోగ్యంపై కూడా ఆరా తీసినట్లు చెప్పారు. దర్శన్ శస్త్రచికిత్సకు నిరాకరించడం వల్ల వెన్ను నొప్పి నుంచి బయటపడేందుకు మరింత సమయం పట్టవచ్చని, దాంతో అతనికి పూర్తి ఆరోగ్య ప్రయోజనం త్వరగా లభించబోదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక హైకోర్టు ఇటీవల దర్శన్‌కు ఆరోగ్య కారణాలతో, వైద్య చికిత్సల కోసం ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జూన్ 11న దర్శన్‌ను పోలీసులు అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన పై విచారణ కొనసాగుతుండగా, సుమలత సహా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దర్శన్‌కు మద్దతు పలుకుతున్నారు.