హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఫిక్స్ అయింది. జూనె 14వ తేదీన ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నరు. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ మధ్య తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో తివ్ర అలజడి రేగింది.
ఈటెల తనను కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్ నడిపిస్తున్నారని ఈటల ఆరోపించారు. పార్టీలో అవమానాలు తప్ప ఆత్మీతయత లేదని ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఈటల టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆ తర్వాత ఈటల సొంతంగా పార్టీ పెడతారని కూడా ఊహాగానాలు వచ్చాయి, లేదంటే బీజేపీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి.
టీఆర్ఎస్ గుడ్‌బై చెప్పిన తర్వాత ఈటల తన సన్నిహితులతో తదుపరి కార్యచరణపై ఆయన బాగా చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి మరియు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఈటలను రాజకీయంగా ఒంటరిని చేయడానికి వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అమలు పరుస్తోంది. అయితే బీజేపీకి గల బలాలపై కూడా నాయకులు చర్చించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా ఓట్లు నమోదవగా, పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాలో కరీంనగర్‌ను గెలిచిన బీజేపీ హుజూరాబాద్‌లో మాత్రం మూడోస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఈటలతో బలం పెరుగుతుందే తప్ప బీజేపీ వల్ల ఈటలకు ఉపయోగం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల ఇమేజ్‌ను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్ నాయకులు చర్చించారు.