హైదరాబాద్: టీఆర్ఎస్ లో విభేధాల నాదుమ ఉన్న ఈటెల రాజేందర్ రాజకీయ జీవితంలో కొత్త మలుపు రానుంది. ఆయన జాతీయ పార్టీ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారు అయినట్లే అని తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ తులా ఉమా, ఇంకొందరు టీఆర్ఎస్ నేతలు త్వరలోనే కాషాయ పార్టీతో జత కట్టనున్నట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌తో ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నారు. కాగా టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న నేతలు, ఉద్యమకారులను కూడా బీజేపీలో చేరేలా చూస్తానని ఈటల మాట ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈటల చేరికపై బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ సమాచారం ఇచ్చినట్లు వినికిడి.
బీజేపీలో చేరే వారి జాబితాను కూడా బీజేపీ అధిష్టానం అడిగి తీసుకుందని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రమేష్ రాథోడ్‌ను బీజేపీలోకి చేర్పించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి నేతలంతా ప్రయాణం అవబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు ఈటల పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనకు ఇప్పటికే ఆహ్వానం అందించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాలు పలువురు ముఖ్య నేతలతో ఇటల ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారనే విషయం అందరిలోనూ ఆసక్తి నెలకొంది.