fbpx
Saturday, November 2, 2024
HomeTelanganaఈటల టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ఈటల టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ETELA-RESIGNS-TRS-PARTY-MEMBERSHIP-AND-MLA-POST

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా టీఆరెస్ మరియు ఈటెల మధ్య రాజుకున్న వివాదం ఎట్టకేలకు ఈ రోజు ఒక ముగింపుకు వచ్చినట్లయింది.

ఈ రోజూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈటెల తనను రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి తప్పించారని, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారని అన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కనీసం ఏం జరిగిందో కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండానే తనపై చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తన వివరణ కూడా అడగలేదని అన్నారు.

హుజురాబాద్‌లో ఎటువంటి ఎన్నిక జరిగినా టీఆరెస్ పార్టీని గెలిపించుకున్నాను, ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్‌ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ తాపత్రయపడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ అన్నారు. అది ప్రగతిభవన్‌ కాదు.. బానిస భవన్ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ వాళ్ళు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్లు ఇన్‌కంట్యాక్స్‌ కట్టేవారికి రైతుబంధు ఇవ్వవద్దని చెప్పాను, హరీష్‌రావు కూడా పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదులుకోమని అన్నారు. కేసీఆర్‌ హయాంలో మంత్రులకు , అధికారులకు ఎటువంటి స్వేచ్ఛ ఇవ్వలేదని అన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ కూడా టీఆరెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular