హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న యూరప్, అమెరికా మరియు మిగిలిన దేశాలు, తమ దేశంలొ ఉంటున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి. ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన వారందరూ ఇప్పుడు తిరిగి ఇక్కడికి వస్తున్నారు.
ఇంకా అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న వారిని కూడా పంపించేస్తున్నారంటే అక్కడ కరోనా సెకండ్ వేవ్‌తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం అవుతంది. ఇలా పంపిస్తున్న వాళ్ళలో ప్రస్తుతం హైదరాబాద్‌కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు.
ఇలా వచ్చే వారిలో చాలా మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, మరి కొందరు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు చేయించుకుంటున్నారు. అందుకోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేసే లేబొరేటరీని కూడా ఏర్పాటు చేశారు.
విదేశాల్లో రోజుకు కొత్త కేసులు లక్షల్లో, మరియు మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందరికీ అందించడం ఆయా దేశాలకు పెద్ద సవాల్‌గా తయారయ్యింది. అందుకు వీలయినంత మేరకు విదేశీయులను వారి దేశాలకు పంపించేస్తున్నాయి.