టాలీవుడ్: లవ్ స్టోరీస్ తో పాటు మిడిల్ క్లాస్ జీవితాలని కళ్ళకి కట్టినట్టు చూపించడం లో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్. శేఖర్ కమ్ముల సినిమాలని చూసినట్లయితే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. బహుశా శేఖర్ కమ్ముల సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడానికి ఇదే కారణం అయ్యుండచ్చు. యూత్ కి నచ్చే లవ్ స్టోరీస్, ఫామిలీస్ కి నచ్చే ఫామిలీ ఎమోషన్స్ అన్ని బ్లెండ్ అయ్యి ఉండేలా రూపొందిస్తాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ సినిమా నుండి ‘ఏవో ఏవో కలలే’ అంటూ సాగే పాటని మహేష్ బాబు విడుదల చేసారు. పాట ఇన్స్టంట్ హిట్ గా దూసుకెళ్తుంది. ఈ పాట కోసం లిరిక్ రైటర్ భాస్కరభట్ల మొదటి సారి శేఖర్ కమ్ములతో కలిసి పని చేసాడు. లిరిక్ వీడియో లో సాయి పల్లవి మరియు చైతన్య డాన్స్ ఆకట్టుకుంది. మామూలుగా చైతు డాన్స్ లో కొంచెం వీక్ కానీ ఈ పాటలో సాయి పల్లవి గ్రేస్ అందుకొని బాగానే ప్రయత్నించినట్టు లిరిక్ వీడియో లో చూపిన కొన్ని షాట్స్ లో కనిపిస్తుంది. మంచి స్టోరీ సెలెక్షన్ తో ఒక్కో హిట్ కొడుతూ ప్రస్తుతం అక్కినేని ఫామిలీ లో నాగ చైతన్య మంచి హిట్ ట్రాక్ లో ఉన్నాడు. అందమైన ప్రేమ కావ్యం లా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదలకి సిద్ధం అవుతుంది.