అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు కూడా పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నం చేశారన్న అభియోగాలతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్నారు.
ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ కోరుతూ, పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు గుంటూరు జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఆ రెండు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు, పిన్నెల్లికి నిరాశ తప్పలేదు.
ఈ పరిణామాలు పిన్నెల్లి భవిష్యత్తుకు తీవ్ర సవాళ్లను కలిగించేలా చేశాయి.