మూవీ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోల్ల ఒకరైన విక్టరీ వెంకటేశ్ మరియు యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఎఫ్-3, ఇది ఎఫ్-2 కి సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రన్ హీరోయిన్లుగా నటించారు.
కాగా ఇదివరకే విడుదలైన పోస్టర్స్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ లభించిది. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ సందర్భంగా మేకర్స్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు.
ఈనెల 9వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎఫ్-2కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.